Testo Yekommakakomma - S. P. Balasubrahmanyam
Testo della canzone Yekommakakomma (S. P. Balasubrahmanyam), tratta dall'album Seenu
ఏ కొమ్మకాకొమ్మ కొంగొత్త రాగం
తీసిందిలే కోయిలా
సుమగీతాల సన్నాయిలా
ఏ పువ్వుకాపువ్వు నీ పూజ కోసం
పూసిందిలే దివ్వెలా
నీ పాదాలకే మువ్వలా
ఒక దేవత దివి దిగి వచ్చే
ప్రియ నేస్తంలాగా
ఎద గూటికి అతిథిగ వచ్చే
అనుబంధం కాగా
మనసాయె మంత్రాలయం
ఇది స్నేహాల దేవాలయం
ఏ కొమ్మకాకొమ్మ కొంగొత్త రాగం
తీసిందిలే కోయిలా
సుమగీతాల సన్నాయిలా
ఆకాశ దేశాన దీపాలు
స్నేహాల చిరునవ్వులు
నా నావ కోరేటి తీరాలు
స్వర్గాల పొలిమేరలు
మమతల మధు మధురిమలిటు సరిగమలాయే
కలబడు మన మనసుల కలవరమైపోయే
గాలుల్లో గంధాలు పూలల్లో అందాలు
జత చేయు హస్తాక్షరి
అభిమానాల అంత్యాక్షరి
ఏ కొమ్మకాకొమ్మ కొంగొత్త రాగం
తీసిందిలే కోయిలా
సుమగీతాల సన్నాయిలా
ఎన్నాళ్లు ఈ మూగభావాలు
సెలయేటి తెరచాపలు
నాలోని ఈ మౌనగీతాలు
నెమలమ్మ కనుపాపలు
కుడి ఎడమల కుదిరిన
కళ ఎదకెదురాయే
ఉలి తగిన శిల
మనసున సొద మొదలాయే
ఈ సప్తవర్ణాల నా స్వప్నరాగాల
పాటల్లో ప్రథమాక్షరి
ఇది ప్రాణాల పంచాక్షరి
ఏ కొమ్మకాకొమ్మ కొంగొత్త రాగం
తీసిందిలే కోయిలా
సుమగీతాల సన్నాయిలా
ఏ పువ్వుకా పువ్వు నీ పూజ కోసం
పూసిందిలే దివ్వెలా
నీ పాదాలకే మువ్వలా
ఒక దేవత దివి దిగి వచ్చే
ప్రియ నేస్తంలాగా
ఎద గూటికి అతిథిగ వచ్చే
అనుబంధం కాగా
మనసాయె మంత్రాలయం
ఇది స్నేహాల దేవాలయం
Credits
Writer(s): Mani Sharma, Veturi
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.