Testo Alloneredu Kalla - Mani Sharma
Testo della canzone Alloneredu Kalla (Mani Sharma), tratta dall'album Seenu
అల్లో నేరేడు కళ్ళదాన
ప్రేమ వల్లో పడ్డానే పిల్లదాన
హల్లో వర్ణాల పూలవాన
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోన
నమ్మెదెలా మైన
ఇంత ప్రేమ నా మీదేనా
కల్లో లేవే నాయన
అల్లుకుంటూ ఒళ్ళో లేనా
అల్లో నేరేడు కళ్ళదాన
ప్రేమ వల్లో పడ్డానే పిల్లదాన
హల్లో వర్ణాల పూలవాన
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోన
దాయి దాయి అనగానే చేతికందేనా చంద్రవాదన
కుంచై నువ్వే తాకగానే పంచప్రాణాలు పొందినాన
బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా
ఏదో చిత్రం చేయగా చేరువయ్యా నేనే చెలిగా
రెప్ప మూసిన తప్పుకోనని
కంటిపాప ఇంటిలోన ఏరికోరి చేరుకున్న దీపమా
అల్లో నేరేడు కళ్ళదాన
ప్రేమ వల్లో పడ్డానే పిల్లదాన
హల్లో వర్ణాల పూలవాన
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోన
అన్నెం పున్నెం లేని వాడని అనుకున్నాను ఇన్నినాళ్ళు
అభం శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్నె కళ్ళు
మైకం పెంచే మాయతో మూగ సైగే చేసే దాహమా
మౌనం మీటే లీలతో తేనే రాగం నేర్పే స్నేహమా
ఒంటరైన నా గుండే గూటిలో
సంకురాత్రి పండగంటి సందడల్లే చేరుకున్న రూపమా
అల్లో నేరేడు కళ్ళదాన
ప్రేమ వల్లో పడ్డానే పిల్లదాన
హల్లో వర్ణాల పూలవాన
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోన
నమ్మెదెలా మైన
ఇంత ప్రేమ నా మీదేనా
కల్లో లేవే నాయన
అల్లుకుంటూ ఒళ్ళో లేనా
Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.