Testo Rajadhi Raja - Shankar Mahadevan
Testo della canzone Rajadhi Raja (Shankar Mahadevan), tratta dall'album Raja Babu
రాజాధి రాజండి మా రాజాబాబు
(మా రాజాబాబు)
మనసున్న మారాజు మా రాజాబాబు
(మా రాజాబాబు)
వరమంటూ అడిగావో శివుడవుతాడు
తొడకొట్టి కదిలాడో యముడవుతాడు
మా కోసం మళ్ళీ పుట్టి ఈ రామరాజు
మా ఊళ్ళో మకుటంలేని మారాజు అయ్యాడు
(రాజాబాబు ఓఓఓఓ రాజాబాబు)
(రాజాబాబు ఓఓఓఓ రాజాబాబు)
ఊరూవాడ మెచ్చే తండ్రికి పుట్టాడు
మంచే పెంచి వారికి వారసుడయ్యాడు ఓ
కల్లా కపటం ఏమీ తెలియని పసివాడు
మాతో కలిసి మాలో ఒకడైపోయాడు ఓ
ఖాదరబాబు నవ్వుతుంటే
కనిపిస్తాడా చంద్రుడైనా
మొనగాడల్లే నడిచి వస్తే
ఎదురొస్తాడా సూర్యుడైనా
వెయ్యేళ్ళైనా నీ పేరు
వింటుందయ్య ఈ ఊరు
మీకన్నా ఎందుకంటt దేవుళ్ళు మాకు
(రాజాబాబు ఓఓఓఓ రాజాబాబు)
మనసూ మమతా ఒకటై
కలిసిన ఈ బంధం
జతగా సాగే ఎన్నో జన్మల అనురాగం ఓ
కలలోనైనా చూడని ఇంతటి వైభోగం ఓ
కథలా విన్నా తనివే తీరవి ఆనందం ఓ
అమ్మానాన్న పెళ్ళి రోజు
చూసే భాగ్యం కలిగే మాకు
ఇద్దరి జంటా చూసి నేడు
పులకించాలి ఎంతవాడు
దేవతలుండే మీ ఇంట
పండగ కాదా ప్రతిపూటా
వర్ధిల్లు దర్జాగా మా బంగారుబాబు
(రాజాబాబు ఓఓఓఓ రాజాబాబు)
రాజాధి రాజండి మా రాజాబాబు
(మా రాజాబాబు)
మనసున్న మారాజు మా రాజాబాబు
(మా రాజాబాబు)
వరమంటూ అడిగావో శివుడవుతాడు
తొడకొట్టి కదిలాడో యముడవుతాడు
మా కోసం మళ్ళీ పుట్టి ఈ రామరాజు
మా ఊళ్ళో మకుటంలేని మారాజు అయ్యాడు
(రాజాబాబు ఓఓఓఓ రాజాబాబు)
(రాజాబాబు ఓఓఓఓ రాజాబాబు)
Credits
Writer(s): E.s. Murthy, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.