Testo Evaro Evaro - Kousalya
Testo della canzone Evaro Evaro (Kousalya), tratta dall'album Kousalya Telugu Songs
ఎవరో ఎవరో ఎదలో ఎవరో
అనుకోని వరమై చేరే
అమృతాల వరదై పారే
తన పేరే ప్రేమ ఆ
తనదే ఈ మహిమ
తనదే తొలి జన్మ ఆ
తరువాతే బ్రహ్మ
ఎవరో ఎవరో ఎదలో ఎవరో
చూపుల్లో పున్నమి రేఖలుగా
రూపుల్లో పుత్తడి రేఖలుగా
మారింది జీవన రేఖ
నా హృదయంలో తానే చేరాక
అధరాలే మన్మధ లేఖ రాయగా
అడుగేమో లక్ష్మణ రేఖ దాటదా
బిడియాల బాటలో నడిపే వారెవరో
బడిలేని పాఠమే నేర్పే తానెవరో
విడిపోని ముడివేసి మురిసేదెవ్వరో
ఎవరో ఎవరో
(స ప గమప పమపమ)
(పసదప మా పద గరిగపగ)
(గరి గరి గపగా రిసరిగరీ)
(నిగసరి నిసదా సా)
(పమప పమపమ పసదా ప మాపదా)
(గరిగపద గరి గరి గపద)
(గరి గరి గరి సదసా)
మల్లెలలో స్నానాలే పోసి
నవ్వులతో నగలెన్నో వేసి
చీకటితో కాటుక పెట్టి
నన్నే తాను నీకై పంపింది
సొగసంతా సాగరమల్లే మారగా
కవ్వింత కెరటాలల్లే పొంగగా
సరసాల నావలో చేరేవారెవరో
మధురాల లోతులో ముంచే తానెవరో
పులకింత ముత్యాలే పంచేదెవ్వరో ఎవరో
ఎవరో ఎవరో ఎదలో ఎవరో
అనుకోని వరమై చేరే
అమృతాల వరదై పారే
తన పేరే ప్రేమ ఆ
తనదే ఈ మహిమ
తనదే తొలి జన్మ ఆ
తరువాతే బ్రహ్మ
ఎవరో ఎవరో ఎదలో ఎవరో
Credits
Writer(s): K S Chandra Bose, Gilla Chakradhar
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.