Testo Ee Roje - Kousalya
Testo della canzone Ee Roje (Kousalya), tratta dall'album Idiot (Original Motion Picture Soundtrack)
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ
చిత్రంగా కురిసింది మదిపై మల్లెలవాన
నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా
నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా
కను రాల్చే కన్నీరువో నను చేరే పన్నీరువో
నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ
చిత్రంగా కురిసింది మదిపై మల్లెలవాన
కన్నులలోనా వెన్నెలలోనా నీ రూపు తోచే
ఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే నాలో నీ బాసలే
తొలిసారిట సిగ్గేస్తోంది మొగ్గేస్తోంది తనువంతా
అపుడపుడు తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వాన
ఆనందమై నాలో అనుబంధమై నీ ప్రేమ నను చేరి వణికించెరా
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ
చిత్రంగా కురిసింది మదిపై మల్లెలవాన
ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా
వికసించే కుసుమం నేనై నిను తాకనా నీలో సడి చేయనా
పని చేస్తే పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే
పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే
సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమ కనువిందు పండించెరా
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ
చిత్రంగా కురిసింది మదిలో మల్లెలవాన
నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా
నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా
కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా
నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా
చంటి ప్లీజ్ ఛి
Credits
Writer(s): Chakri, Kandikonda
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.