Testo Ammo Ammayena - Hariharan feat. Sujatha
Testo della canzone Ammo Ammayena (Hariharan feat. Sujatha), tratta dall'album Vasantham
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం
ఇలలోన నిన్ను మించే సిరిలేదే నగ్నసత్యం
నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
నిషా కళ్ళతోటి వలే వేయకమ్మా
అరే చిక్కుకోదా యదే చాపలా
వయ్యారాల వైపు అలా చూడకయ్యా
సిరే కందిపోదా మరీ ఎర్రగా
నువ్వే కాని పువ్వు అయితే నేను తుమ్మెదౌతా
నువ్వే కాలి మువ్వ అయితే నేను రాగమౌతా
నిన్నే దాచుకుంటాలే ప్రియా గుండె కోవెల్లోన
బాపు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలీ
ప్రాణం పోసుకువచ్చిన పాటవు నీవు సఖీ
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
ప్రియా నిన్ను చూసి మదే మారిపోయే
అదేమ్మాయో గానీ వానవెల్లువ
చెలీ నిన్ను చేరి ఎడారైన గాని
వసంతాలు జల్లె పూలవెల్లువ
నువే నిద్దరోతే నేను జోలపాటనౌతా
నువే దగ్గరైతే హాయిలోనే తేలిపోతా
చెలీ నువ్వు ఔనంటే సరాగాల సంబరమౌతా
నువ్వు నేను ఏకమై ఇపుడే మనమౌదాం
నింగినేల సాక్షిగా ఎపుడో ఒకటౌదాం
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
కలలోన నిన్ను చూసి మనసారా కోరుకున్నా
ఇలలోన ఇంతలోన ఎదురైతే చేరుకున్నా
నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది
Credits
Writer(s): Kula Sekhar, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.