Testo O Jabili - Chitra, Meenakshi Bhujang, Ramana Gogula & Shivaji
Testo della canzone O Jabili (Chitra, Meenakshi Bhujang, Ramana Gogula & Shivaji), tratta dall'album Chitra - Best Telugu Melodies, Vol. 2
Hello
Hai
Johny, Johny
Yes, Papa
Eating sugar?
No, Papa
Telling lies?
No, Papa
Open your mouth
Ha Ha Ha
ఓ జాబిలి విన్నావా పాటని
నీ నీడలో కలకాలం సాగని
ఈ అల్లరే మా ఎదకు పండగని
ఈ నవ్వులే మాకు తొలి పున్నమని
చిన్నారి జీవితాలే చిందులేసి ఆడని
ఓ జాబిలి విన్నావా పాటని
నీ నీడలో కలకాలం సాగని
మెళకువలో కలలుగనే
అందమైన మనసులివి
ఉరకలతో ఉరుములతో
పరుగు తీయు వయసులివి
పసిమదిలో కసి ముదిరి
చేరువైన గెలుపులివి
జగడములో ఎగసి పడే
తీపి తీపి అలకలివి
ప్రాయం పలికే కొంటె రాగమై
కాలం ఒడిలో జంట తాలమై
వెండిపూల వెన్నెలలో బ్రతుకు సాగని
ఓ జాబిలి విన్నావా పాటని
నీ నీడలో కలకాలం సాగని
అలజడిలో అలసటలో
సేద తీర్చు స్వర్గమిది
కలత కూడా కలత పడే
మంచితనపు మలుపులివి
భువనములో ప్రతి మనిషి
మరువలేని కథలు ఇవి
హృదయములో పదిలముగా
నిలిచిపోవు గురుతులివి
ఎగసే ఎదలో ఎన్ని ఆశలో
ఉరికే మదిలో ఎన్ని ఊసులో
చిన్ననాటి చిలిపితనం తిరిగిరాదులే
ఓ జాబిలి విన్నావా పాటని
నీ నీడలో కలకాలం సాగని
ఈ అల్లరే మా ఎదకు పండగని
ఈ నవ్వులే మాకు తొలి పున్నమని
చిన్నారి జీవితాలే చిందులేసి ఆడని
Credits
Writer(s): S.a. Rajkumar, Kulashekar
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.