Testo Ye Manishike Majiliyo - Gopi Sundar
Testo della canzone Ye Manishike Majiliyo (Gopi Sundar), tratta dall'album Majili (Original Motion Picture Soundtrack)
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
నువ్వు నిజంలాగ
నను ముడేస్తుంటే ఈ నిమిషాన
నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
నువ్వు ప్రతీసారి
నీ ప్రపంచంలా నను చూస్తున్నా
నేను అదే పనిగా నిను వెలేస్తూనే ఉన్నా
నువ్వు నను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నేను ఒక మనసులేని
శిలలాగా మారినానా
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు
నా నిన్నలోని ఆ గురుతులన్నీ
ఈ మనసులోంచి చెరిపేదెలాగా?
ఇన్నాళ్ళూ నాలో
కలిసున్న ప్రాణం
నే వేరు చేసి బ్రతికేదెలాగా?
ఈ వేషమే ఎన్నాళ్లని
విధి అడుతోందా ఈ నాటకాన్ని
నువ్వు నిజంలాగ
నను ముడేస్తుంటే ఈ నిమిషాన
నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
నీ పిలుపు కోసం వెతికింది మౌనం
ఆ వరము కోరి మిగిలుంది ప్రాణం
నా గుండెనడుగు చెబుతుంది నీకే
ఈ ఊపిరుంది నీ చెలిమి కొరకే
నీ కోసమే వేచిందిలే
నువు సేద తీరే
ఈ ప్రేమ మజిలీ
నేను నిజంలాగ
నిను ముడేస్తుంటే ఈ నిమిషాన
నువ్వు గతంలోని ఆ కాలల్లోనే ఉన్నా
నేను ప్రతీసారి
నా ప్రపంచంలా నిను చూస్తున్నా
నువ్వు అదే పనిగా
నను వెలేస్తూనే ఉన్నా
నేను నిను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నువ్వు ఒక మనసులేని
శిలలాగా మారినావా
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు
Credits
Writer(s): Vanamali, C S Gopisundar
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.