Testo Vennele Kurisenule - Udit Narayan feat. Sujatha
Testo della canzone Vennele Kurisenule (Udit Narayan feat. Sujatha), tratta dall'album Muddula Koduku
వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే
వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే
పూలనే కోయగానే కొమ్మలే బాధపడే
ఎవరికి తెలుపకనే తనలో పొగిలెనే
హే అక్కా అక్కా రమ్మక్కా
నువు దిక్కులు గిక్కులు చూడక్కా
హే దారిని పోయే దానక్క
దాటిపోయే బాలక్క ఆడి పాడి చిందెయ్యక్క
వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే
బాష అందం భావం అందం లోకమంత అందం
నువ్వుఅందం నువ్వు ఆనందం రేపటికై నేనందం
ఒకటి పోతే ఒకటి వచ్చే దేవుని తీర్పు ఇది
బ్రతుకు అంటే జూదమవ్వదా పోయినా వచ్చుటకు
ఉదయం నీకోసం నా హృదయం నీకోసం
దైవం నీవేనా నే వరములను ఆడిగేనా
బాధలు ఎవరికి లేవు
తీరేవవికాదు
వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే
అందమంటే అందమంటే మనసునే అంటారు
మనసు అందం ముఖములోనే కనిపించునంటారు
కన్నె వలపు పడుచు పిలుపు అన్నిటికి ఆశపడు
ఆశపడితే అవస్థలేగా చివరకి మిగిలెను
కంటికే రెప్ప బరువా చిరుగాలికి ఆకు బరువా
ఆహా నీ మాట నా చెవులకి బరువేలే
పాడనా ఓక పాట
ఎందుకే ఈ వేట
వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే హృదయం పొంగినులే
పూలనే కోయగానే కొమ్మలే బాధపడే
ఎవరికి తెలుపకనే తనలో పొగిలెనే
హే అక్కా అక్కా రమ్మక్కా
నువు దిక్కులు గిక్కులు చూడక్కా
హే దారిని పోయే దానక్క
దాటిపోయే బాలక్క ఆడి పాడి చిందెయ్యక్క
Credits
Writer(s): Vidya Sagar, Siva Ganesh, A M Ratnam
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.