Testo Undiporaadhey - Sid Sriram
Testo della canzone Undiporaadhey (Sid Sriram), tratta dall'album Soulful Hits Of Sid Sriram
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
అయ్యో అయ్యో
పాదం నేలపై ఆగనన్నదీ
మళ్లీ మళ్లీ గాల్లో
మేఘమై తేలుతున్నదీ
అందం అమ్మాయైతే
నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే
అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
నిశిలో శశిలా నిన్నే చూశాక
మనసే మురిసే ఎగసే అలలాగ
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెపుడూ చూడలే
చీకట్లో కూడ నీడలా
నీవెంటే నేనుండగా
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిమిషం చాలులే
అందం అమ్మాయైతే
నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే
అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
Credits
Writer(s): Radhan, Kittu Vissapragada
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.