Testo Samajavaragamana - Sid Sriram
Testo della canzone Samajavaragamana (Sid Sriram), tratta dall'album Soulful Hits Of Sid Sriram
నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకువెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకి కావాలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా, నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సామజవరగమన, నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా
సామజవరగమన, నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా
నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
మల్లెల మాసమా
మంజుళ హాసమా
ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా
విరిసిన పించమా
విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నల వశమా
అరె నా గాలే తగిలినా, నా నీడే తరిమినా
ఉలకవా, పలకవా భామా
ఎంతో బతిమాలినా, ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన మనవిని వినుమా
సామజవరగమన, నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా
సామజవరగమన, నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా
నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకి కావాలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
Credits
Writer(s): Sirivennela Seetharama Sastry, S Thaman
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.