Testo Telugu Padaniki - Veturi Sundararama Murthy feat. S. P. Balasubrahmanyam, Sujatha & Renuka
Testo della canzone Telugu Padaniki (Veturi Sundararama Murthy feat. S. P. Balasubrahmanyam, Sujatha & Renuka), tratta dall'album Annamayya
తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞానపదం
ఏడు స్వరాలే ఏడుకొండలై వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినది
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతీగానపు మహిమలు తెలిసి
శితహిమకందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని
తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో... ప్రవేశించే ఆ నందకము
నందనానందకారకము
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
పద్మావతియే పురుడుపోయగా
పద్మాసనుడే ఉసురుపోయగా
విష్ణుతేజమై నాదబీజమై ఆంధ్రసాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయ
అసతోమా సద్గమయా
అవతరించెను అన్నమయ
అసతోమా సద్గమయా
పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగు హారతై ఎదలయలో పదకవితలు కలయా
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ
తమసోమా జ్యోతిర్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
Credits
Writer(s): Annamayya, M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.