Testo Prayathname - Devi Sri Prasad
Testo della canzone Prayathname (Devi Sri Prasad), tratta dall'album Chitralahari
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే
అవకాశం పొందడమే ఆ
అడుగు అడుగు వెయ్యనిదే
అంతరిక్షమే అందేనా
పడుతూ పడుతూ లేవనిదే
పసిపాదం పరుగులు తీసేనా
మునిగి మునిగి తేలనిదే
మహాసంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే
కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపే ఏమైనా
మధ్యలో వదలొద్దురా నీ సాధన
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే
అవకాశం పొందడమే
వెళ్లే దారుల్లోన రాళ్లే అడ్డొస్తున్నా
అడ్డును కాస్తా మెట్టుగ మలచి
ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా
అది ఎర్ర సిరాగా
నీ చరితను రాస్తుందనుకోవాలి
అడుగంటూ వేసాక
ఆగకుండా సాగాలిరా నీ సాధన
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే
అవకాశం పొందడమే
Credits
Writer(s): Chandra Bose, G Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.