Testo Padavi Datani - Ramana Gogula feat. Sunitha
Testo della canzone Padavi Datani (Ramana Gogula feat. Sunitha), tratta dall'album Thammudu
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా
మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ
తలుచుకుని అలసిపోతోందా కలుసుకునే చొరవ లేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి
అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
ఇదిగిదిగో కళ్లలో చూడు కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కల
బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
(ఏ కోయిలా
ఓ కోయిలా
ఏ కోయిలా
ఓ కోయిలా
ఏ కోయిలా
ఓ కోయిలా
ఏ కోయిలా
ఓ కోయిలా
ఏ కోయిలా
ఓ కోయిలా)
Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.