Testo Oo Chandruda - Sindhuri
Testo della canzone Oo Chandruda (Sindhuri), tratta dall'album Hey Pillagada
ఓ చంద్రుడా నీలోనా
ఆవేశమే తగ్గేనా
అందమైన ఈ లోకం
అందుతుంది నీకోసం
చిరునవ్వుతో ప్రతి గుండెనీ గెలిచెయ్
ఒక్కసారీ నీ కోపం మీద
కోపం చూపి నవ్వరా
అందుకోసం నే ఎన్ని సార్లు
చూస్తుంటానో అడగరా
నీ పెదవుల పైన నవ్వుని
ఆపి నేరం చెయ్యొద్దు
నీ ఎదురుగ నిలిచిన మనసుని
నువ్వు గాయం చెయ్యొద్దు
సహనం తో నీకన్నీ సాధ్యం
చిరునవ్వే నీ గెలుపుకు మంత్రం
అందమైన ఈ లోకం
అందుతుంది నీకోసం
నిన్నే తిరిగీ
నీ మీద పడ్డట్టు
ఇంకేదో అయినట్టు గొడవెందుకు
నవ్వే పనికి కర్చేమి లేదంట
తప్పేమి కాదంట నవ్వోచ్చు గా
నీ అందం, నీ ఆనందం
నీ చేతుల్లో ఉండాలంటే
నువ్వింక ఒదిలెయ్యలీ కోపం
ఓ సంతోషం, నీ దాసోహం
అవ్వాలంటే సూత్రం
పెదవులపై చిరునవ్వుంటే చాలురా
ఎంత పెద్ద బాధకైన
పలకరింపే మంచి మందు
చిరునవ్వుతో ప్రతి గుండెనీ గెలిచెయ్యి
ఒక చూపుతో చిరు కాంతులే పంచెయ్యి
పిల్లగాడా
నువు నవ్వావంటే నాలో వీణే మోగురా
నీ నవ్వు కోసం
నే ఎన్ని సార్లు చూస్తున్నానో అడగరా
నీ పెదవుల పైన నవ్వుని
ఆపి నేరం చెయ్యొద్దు
నీ మనసులో కలిగే సంతోషానికి
వారధి కట్టొద్దు
నీ పెదవుల పైన నవ్వుని
ఆపి నేరం చెయ్యొద్దు
నీ మనసులో కలిగే సంతోషానికి
వారధి కట్టొద్దు
సహనం తో నీకన్నీ సాధ్యం
చిరునవ్వే వీడద్దు నువ్వే
Credits
Writer(s): Gopi Sundar, Surendra Krishna
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.