Testo Nene Kani Nenai Undaga - Yuvan Shankar Raja, Haricharan & Deepak
Testo della canzone Nene Kani Nenai Undaga (Yuvan Shankar Raja, Haricharan & Deepak), tratta dall'album Sikindar (Original Motion Picture Soundtrack)
నేనే కాని నేనై ఉండగా
నీ చూపే తాకి ప్రాణమే మరుజన్మే పొందగా
ఎన్నో మార్పులు రానే వచ్చెగా
అవి మారేకొద్దీ అణువణువులో నువ్వే కొత్తగా
ఎందుకో
ఇంతలో
ఎందుకో ఇంతలో అంతటి వింతలే
ప్రేమ మయమే మహిమే మహిలో నిండెలే
తను చిలిపిగ నగవులు చిలికితే
తొలిచనువుల చలువలు సోకితే
అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి
ఉరికే ఎద కదలిక కుదురిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ శ్రుతిగతి జతపడు ప్రియలయలే నీ ఊపిరి
నేనే కాని నేనై ఉండగా
నీ చూపే తాకి ప్రాణమే మరుజన్మే పొందగా
Oh ఎన్నో మార్పులు రానే వచ్చెగా
అవి మారేకొద్దీ అణువణువులో నువ్వే కొత్తగా
కనులకల ఎదురైతే కునుకుకిక కుదురేది
కల నిజం యుగం క్షణం నీ చెంతటా ఓ వింతటా
చూపులకు కనబడని రేపటిని చదివె మది
ఊహాలోకం నాముందర కోరిందిలే ఏ తొందర
హద్దుపొద్దులేని వలపు నే పంచనా
చొరవచూపు వేళ నిన్ను నే మించనా
నిన్ను నే మించనా
నీ శ్వాసే నాలో ఉసురై ఉంచనా
తను చిలిపిగ నగవులు చిలికితే
తొలిచనువుల చలువలు సోకితే
అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి
ఉరికే ఎద కదలిక కుదురిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ శ్రుతిగతి జతపడు ప్రియలయలే నీ ఊపిరి
మనసుపొరలో మాటే పలికినది నీ పాటే
నిరంతరం నీ ధ్యానమే ఇహంపరం నీ కోసమే
అడుగు కోరిన బాటే కడవరకు నీతోటే
ఏ జన్మకీ నీ తోడునే వేడానులే అత్యాశగా
నీకు తెలుపలేని తలపులే వేలులే
నీవు చెంతనుంటే మౌనమే మేలులే
మౌనమే మేలులే
ఈ తహతహ తీర్చగ ప్రేమే చెప్పవా
తను చిలిపిగ నగవులు చిలికితే
తొలిచనువుల చలువలు సోకితే
అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి
ఉరికే ఎద కదలిక కుదురిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ శ్రుతిగతి జతపడు ప్రియలయలే నీ ఊపిరి
Credits
Writer(s): Yuvanshankar Raja, Rakendu Mouli
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.