Testo Muvvala - Udit Narayan feat. Usha
Testo della canzone Muvvala (Udit Narayan feat. Usha), tratta dall'album Missamma
నువ్వలా జిలిబిలి గువ్వలా
నను కవ్వించకే రత్నమాల
కూయకే అల్లరి కోయిల
ఆమని ముందర ఈ తొందరేల
పొంగుతున్న నాలో ప్రేమ
ఇంద్రధనస్సు నువ్వేనమ్మ
నింగి వీడి వయ్యారంగా రావే
మక్కువంతా నీపై ఉన్నా
చుక్క పొద్దు పొడిచే దాకా
పక్కకింక రాలేనయ్యో నేనే
అంత దాక ఇంత దూరమా
అవ్వనీ చెంతనే విరహమా
నువ్వలా జిలిబిలి గువ్వలా
నను కవ్వించకే రత్నమాల
సరికొత్త ప్రియ సఖిలాగ
నిను కోరేను నే ప్రతిరోజూ
గది బయట మన సడి చూసి
పడి నవ్వేను ఆ నెలరాజు
దోర ఆశలన్నీ పూసాయి మల్లె పూలు
చాటుమాటు లేని సరసాలు చాలు చాలు
ఊసులాడమంటూ పిలిచాయి జాజి పొదలు
వేళ కాని వేళ మరాము చేయవలదు
రగిలే వగలే సెగలై రేగిపొయే మోజులు
లాల లాలలాల
నువ్వలా జిలిబిలి గువ్వలా
నను కవ్వించకే రత్నమాల
హ్మ్
హే ఆహా... ఆహాహా హేహే ఊహూ
లాల లాలల
అనగనగా ఒక మహరాజు
తన జత కలిసే ఒక మహరాణి
ముచ్చటగా వారొక జంటై
శృతి కలిపారు సరసాలన్నీ
రాణి రాజు వంక రంభల్లే చేరుకోగ
రాజు రాణి దారి ఈ నడుమునల్లుకోగ
వేయి చందనాల వసంత కేళి లోన
హాయి శోభనాల సుఖాన తేలిపోగ
మనసే బృందావనిలా పరవసించే నేడిలా
లాలలలా లలాల
జంటగా సరసములాడగ
సమయం కుదిరెనే రత్నమాల
సుందరా విరి పూబంతిలా
సందిట వాలనా నంద గోపాల
Credits
Writer(s): Sahithi, Vandemataram Srinivas
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.