Testo Kalalalo Nuvve - Udit Narayan feat. Kavitha Krishnamurthy
Testo della canzone Kalalalo Nuvve (Udit Narayan feat. Kavitha Krishnamurthy), tratta dall'album Chirujallu (Original Motion Picture Soundtrack)
కళ్లలో నువ్వే నువ్వే
నా కలలలో నువ్వే నువ్వే
మనసులో నువ్వే నువ్వే
ప్రతి మాటలో నువ్వే నువ్వే
ఎదురు పడిన ప్రతి వారిలోన
నిను చూశానా
నీవు తప్ప జనులెవరులేర
ఈ లోకాన
తేల్చవా నువ్వే
కళ్లలో నువ్వే నువ్వే
నా కలలలో నువ్వే నువ్వే
నిన్నంత నిదుర లేదు నీవల్లా
అంత లేనిపోని నిందలా
హే... నన్నింక వదలనంటూ పంతాలా
లేనే లేనే చుట్టుపక్కలా
రేయంతా నా ఊహల్లో
నువ్వులేవా నిజమోప్పుకో
చీకట్లో ఏం చూసావో
నన్నేనా గుర్తు చేసుకో
జ్యోతుల్లా మారిన చూపుల్లో
నీ రూపు సాక్ష్యంగా చూపనా
నీలాల నీకంటి పాపల్లో
బంధించుకున్నావా నన్నిలా
చెలిమి సంకెళా
కళ్లలో నువ్వే నువ్వే
నా కలలలో నువ్వే నువ్వే
మనసులో నువ్వే నువ్వే
ప్రతి మాటలో నువ్వే నువ్వే
క్షేమంగా ఉంది కద నా మనసు
నాకు మాత్రమేమి తెలుసు
నీకుగాక ఎవరికెఱుక దాని ఊసు
కంట చూడలేదే అస్సలు
ఏనాడో నా చేజారి
వెళ్లిందే నిన్ను చేరగా
ఏ గాల్లో తేలుతూ ఉందో
నా దాకా చేర లేదుగా
గుమ్మాన్ని దాటదు ఎప్పుడూ
ఏమైందో అంటేగా ఎప్పుడూ
ఆచూకి తెల్సినప్పుడూ
నీకప్పగిస్తానే అమ్మడూ
నన్ను నమ్మవే
కళ్లలో నువ్వే నువ్వే
నా కలలలో నువ్వే నువ్వే
మనసులో నువ్వే నువ్వే
ప్రతి మాటలో నువ్వే నువ్వే
Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Vandemataram Srinivas
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.