Testo Jumbaye - Mano Chitra
Testo della canzone Jumbaye (Mano Chitra), tratta dall'album Kshana Kshanam (Original Motion Picture Soundtrack)
శ్రావణ వీణా
స్వాగతం
స్వరాల వెల్లువ welcome
లేత విరి వానా
నవ్వమ్మా
ఆనందంలో
(జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే)
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
(జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే)
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింత గిచ్చింది
(జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే)
వయసాగనిది రేగినది సరసములోనా
చలి దాగనిది రేగినిది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చెక్కిలి గిలి
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
(జుంబాయే ఆ గుంబహే)
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింత గిచ్చింది
(జుంబాయే ఆ గుంబహే)
అందిస్తున్న వగరే చిరు చిగురే తొడిగే
చిందిస్తున్న సిరులే మగసిరులే అడిగే
రమ్మంటున్న ఎదలో తుమ్మెదలే పలికే
ఝుమ్మంటున్న కలలో వెన్నెలలే చిలికే
గలగలమని తరగల తరగని కల కదిలిన కధలివిలే
తళతళమని కులుకుల అలుకలు గని చిలికిన సుధలివిలే
చెలువలు గని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే
అలుపెరుగని అలరుల అలలను గని తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే
తలపడకిక తప్పదులే
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
(జుంబాయే ఆ గుంబహే)
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింత గిచ్చింది
(జుంబాయే ఆ గుంబహే)
ఊ కొట్టింది అడవే మన గొడవే వింటూ
జో కొట్టింది ఒడిలో ఉరవడులే కంటూ
ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు
తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు
అరవిరిసిన తలపున కురిసెను కల కలిసిన మనసులలో
పురి విరిసిన వలపులు తెలిపెను కధ పిలుపుల మలుపులలో
ఎద కొసరగ విసిరెను మధువుల వల అదిరిన పెదవులలో
జత కుదరగ ముసిరెను అలకల అల చిలకల పలుకులు చిలికిన చినుకులలో
తొలకరి సిరి జల్లులలో
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
(జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే)
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింత గిచ్చింది
(జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే)
వయసాగనిది రేగినది సరసములోనా
చలి దాగనిది రేగినిది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చెక్కిలి గిలి
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
(జుంబాయే ఆ గుంబహే)
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింత గిచ్చింది
(జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే
జుంబాయే ఆ గుంబహే)
Credits
Writer(s): M. M. Keeravani, Vennelakanti Subbu Rajeswara Prasad
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.