Testo Hay Rey Hai - Karthik
Testo della canzone Hay Rey Hai (Karthik), tratta dall'album Okkadu (Original Motion Picture Soundtrack)
నువ్వేం మాయ చేసావోగాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేసావోగాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
హాయ్ రే హాయ్ రే హాయ్ అందని
రేయి చాటు రాగం విని
ఎవరు తనని పిలిచారని
అడిగి చూడు నీ మనసుని
హే కాలాన్నే కదలనీయని
కనికట్టేం జరగలేదని
ఈ తియ్యని మాయ తగదని
తెలుసా అని
మనసూ నీదే మహిమా నీదే
పిలుపూ నీదే బదులూ నీదే
నువ్వేం మాయ చేసావోగాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేసావోగాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
మూగ మనసిది ఎంత గడుసుది
నంగనాచి సంగతులెన్నో వాగుతున్నది
ఓహో ఇంత కాలమూ కంటిపాపలా
కొలువున్న కల నువ్వే అంటున్నది
హాయ్ రే హాయ్ రే హాయ్ అందని
రేయి చాటు రాగం విని
ఎందుకు ఉలికి పడుతుందని
అడిగి చూడు నీ మనసుని
హేయ్ నిదురించే నీలి కళ్లలో
కల ఎప్పుడు మేలుకున్నదో
ఆ కల ఏం వెతుకుతున్నదో
తెలుసా నీ కనులూ నీవే
కలలు నీవే
పిలుపూ నీవే బదులూ నీవే
నువ్వేం మాయ చేసావోగాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేసావోగాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
పిచ్చి మనసిది హా ఎంత పిరికిది
నచ్చుతానో లేదో నీకు అడగమన్నది
ఓహో ఆశ ఆగక అడుగు సాగకా
అలలాగ ఎగిరెగిరి పడుతున్నది
హాయ్ రే హాయ్ రే హాయ్ అందని
రేయి చాటు రాగం విని
గాలి పరుగు ఎటువైపని
అడిగి చూడు నీ మనసుని
హేయ్ ఏ దారిని సాగుతున్నదో
ఏ మజిలీ చేరుకున్నదో
ఏ తీరం కోరుకున్నదో తెలుసా అని
పదమూ నీదే వెలుగూ నీదే
పిలుపూ నీదే బదులూ నీదే
నువ్వేం మాయ చేసావోగాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేసావోగాని
ఆహాహహా ఉహూహు ఆహా
Credits
Writer(s): Sarma Mani, Sastry Seetharama
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.