Testo Enduku Chentaki - Unnikrashan
Testo della canzone Enduku Chentaki (Unnikrashan), tratta dall'album Konchem Istam Konchem Kastam (Original Motion Picture Soundtrack)
ఎందుకు చెంతకి వస్తావో
ఎందుకు చెయ్ వదిలేస్తావో
స్నేహమా స్నేహమా చెలగాటమా చెలగాటమా
ఎపుడు నీ ముడి వేస్తావో
ఎప్పుడెలా వీడదీస్తావో
ప్రణయమా ప్రణయమా పరిహాసమా పరిహాసమా
శెపించే దైవమా దహించే దీపమా
ఇదే నీ రూపమా ప్రేమా
ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా
గెలిస్తే నష్టమా ప్రేమా
ఈ ఈ కలత కాలేమమతా
మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా
మరలి రాని గతము గానే మిగిలిపోతావా
రెప్పలు దాటవు స్వప్నాలు
చెప్పక తప్పదు వీడ్కోలు
ఉరుకో ఓ హృదయమా
నిజం నిష్ఠురమా వేదిస్తే కష్టమా
కన్నీటికి చెప్పవే ప్రేమా
ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా
గెలిస్తే నష్టమా ప్రేమా
వెంట రమ్మంటూ తీసుకెళతావు
నమ్మి వస్తే నట్టడవిలో విడిచిపోతావు
జంట కమ్మంటూ ఆశ పెడతావు
కలిమి ఉంచే చెలిమి తుంచే కలహమవుతావో
చేసిన బాసలు ఎన్నంటే
చెప్పిన ఊసులు ఏవంటే
మౌనమా మమకారమా
చూపుల్లో శూన్యమా గుండెలో గాయమా
మరి వేధించకే ప్రేమా
తరార రారరా తరార రారరా
తరార రారరా రార
ఎందుకు చెంతకి వస్తావో
ఎందుకు చెయ్ వదిలేస్తావో
స్నేహమా స్నేహమా చెలగాటమా చెలగాటమా
ఎపుడు నీ ముడి వేస్తావో
ఎప్పుడెలా వీడదీస్తావో
ప్రణయమా ప్రణయమా పరిహాసమా పరిహాసమా
Credits
Writer(s): Mahadevan Shankar, Noorani Ehsaan, Sastry Seetharama, Mendonsa Peter
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.