Testo Emai Poyave - Sid Sriram
Testo della canzone Emai Poyave (Sid Sriram), tratta dall'album Padi Padi Leche Manasu (Original Motion Picture Soundtrack)
ఏమైపోయావే నీవెంటే నేనుంటే
ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే
నీతో ప్రతి పేజీ నింపేశానే
తెరవకముందే పుస్తకమే విసిరేశావే
నాలో ప్రవహించే ఊపిరివే
ఆవిరిచేసి ఆయువునే తీసేశావే
నిను వీడిపోనంది నా ప్రాణమే
నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే
సగమే నే మిగిలున్నా
శాసనమిది చెబుతున్నా
పోనే లేనే నిన్నొదిలే
ఏమైపోయావే నీవెంటే నేనుంటే
ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే
ఎటు చూడూ నువ్వే ఎటు వెళ్లనే
నే లేని చోటే నీ హృదయమే
నువ్వు లేని కలకూడా రానేరాదే
కలలాగ నువు మారకే
మరణాన్ని ఆపేటి వరమే నీవే
విరహాల విషమియ్యకే
ఏమైపోయావే నీవెంటే నేనుంటే
ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే
Credits
Writer(s): Krishna Kanth, Vishal Chandrashekar
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.