Testo Anthapuramlo - K. S. Chithra feat. Sadhana Sargam, Chinmayi & Chorous
Testo della canzone Anthapuramlo (K. S. Chithra feat. Sadhana Sargam, Chinmayi & Chorous), tratta dall'album Sweety Anushka Shetty
అంతఃపురంలో అందాల చిలకా
సందేహమేలనే అంతగా
అంబరమేలగా అడ్డు ఎవరు నీకిక
చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిగా
రివ్వంటు రావే స్వేచ్ఛగా
అద్దాల మేడలో పొద్దు గడపకే ఇక
అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక
వెల్లువై పొంగుతున్నదే వేల పూల వాటిక
ఇల్లారా అన్నదే విరుల వీచిక
అంతఃపురంలో అందాల చిలకా
అంతఃపురంలో అందాల చిలకా
రేయి వెనకాల
రాని కునుకేల
వెలికి రా శశికళా ననన
జలతారు ముసుగేల
చిలిపి జలకాల
మునిగి పోదాం హలా ననన
పరదాలు పహరాలు దాటి పోవాలి ఆగిపోకలా
వాయువేగాన సాగి పోవాలి అన్నివైపులా
పెట్టేదెవరట కలలకు కాపలా
పట్టేదెవరట ఉరికిన ఊహలా
కట్టేదెవరు మనను సయ్యాటలా
అంతఃపురంలో అందాల చిలకా
అంతఃపురంలో అందాల చిలకా
గాలి గిలిగింత పూల పులకింత
తనువు అణువణువునా ననన
సిరికొత్త కవ్వింత కొంటె కేరింత
మదికి విన్నవించెనా ననన
నీలాల నయనాల వెల్లి విరిసేను మెరుపు మిలమిలా
అహ పాల కెరటాల ఊయలూగేను ఊపిరే ఇలా
ఏదో మధురిమ మనకది తెలిసెనా
ఏదో సరిగమ మననటు పిలిచెనా
ఏవో సుధలు చిలుకు ఆలాపన
అంతఃపురం లో అందాల చిలకా
సందేహమేలనే అంతగా
అంబరమేలగా అడ్డు ఎవరు నీకిక
చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిగా
రివ్వంటు రావే స్వేచ్ఛగా
అద్దాల మేడలో పొద్దు గడపకే ఇక
అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక
వెల్లువై పొంగుతున్నదే వేల పూల వాటిక
ఇల్లారా అన్నదే విరుల వీచిక
అంతఃపురంలో అందాల చిలకా
అంతఃపురంలో అందాల చిలకా
Credits
Writer(s): Ilayaraja, Seetharama Sasthri
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.