Testo Anaganaga Kadala - Karthik
Testo della canzone Anaganaga Kadala (Karthik), tratta dall'album Mass Maha Raja Ravi Teja
హొయ్ అనగనగ కధలా
ఆ నిన్నకు సెలవిస్తే
అరేయ్ కనులను వెలిగించే
ప్రతి ఉదయం మనదేలే
లోకాన చీకటిని తిడుతూనే ఉంటామా
ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా
ఆ వెలుగులకు తొలి చిరునామ
అది ఒకటే చిరునవ్వేనమ్మ
అనగనగ కధల
ఆ నిన్నకు సెలవిస్తే
అరేయ్ కనులను వెలిగించే
ప్రతి ఉదయం మనదేలే
హేల్ల హేలాలా జాబిలి కంట్లో కన్నీళ్ళ
హేల్ల హేలాలా వెన్నెల కురవాలా
హొయ్ బాధలో కన్నులే
కందినంత మాత్రాన
పోయిన కాలము పొందలేముగా
రేగిన గాయమే ఆరనంత మాత్రాన
కాలమే సాగక ఆగిపోదుగా
అరేయ్ ఈ నేల ఆకాశం
ఉందే మనకోసం
వందేళ్ళ సంతోషం అంతా
మన సొంతం
ఈ సరదాలు ఆనందాలు
అలలయ్యేలా అల్లరి చేద్దాం
అనగనగ కధల
ఆ నిన్నకు సెలవిస్తే
అరేయ్ కనులను వెలిగించే
ప్రతి ఉదయం మనదేలే
హేల్ల హేలాలా హేల్లే లాలాల లాలాల
హేల్ల హేలాలా హేల్లే లాలా లా
ఎందుకో ఏమిటో ఎంత మందిలో ఉన్నా
నా యద నీ జతే కోరుతుందిగా
ఒంటరి దారిలో నాకు తోడువైనావు
ఎన్నడూ నీడగా వెంట ఉండవా
హే అరేయ్ కలలే నిజమైనాయి
కనులే ఒక్కటయ్యి
కలిపేస్తూ నీ చెయ్యి
అడుగే చిందెయ్యి
మన స్నేహాలు సహవాసాలు
కలకాలాలకు కథ కావాలి
హేల్ల హేలాలా హేల్లే లాలాల లాలాల
హేల్ల హేలాలా హేల్లే లాలా లా
Credits
Writer(s): Devi Sri Prasad, Sahithi
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.