Testo Aligava - Nihal
Testo della canzone Aligava (Nihal), tratta dall'album Laxmi Kalyanam
అలిగావా చిట్టి చిలక
దిగవా నేల వంకా
అడిగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
అలిగావా చిట్టి చిలక
దిగవా నేల వంకా
అడిగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
అవుననుకో గోరువంకా అలుసిచ్చాను కనుక
జరిగింది తెలుసుకోక నాపై నిందలేయక
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక
అలిగావా చిట్టి చిలక
దిగవా నేల వంకా
అడిగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
ఓ కన్ను మూసి చూస్తున్నట్టు ఉంది
నా ఒంటి నడక నాకే నచ్చకుంది
నాతోనే నాకు గొడవయ్యినట్టు ఉంది
నా నుంచి నేనే వేరయ్యినట్టు వుంది
ఊరుకోలేను చేరుకోలేను
మనసిలా ఎందుకుంది
మూగనేకాను మాటకాలేను ఎమిటవుతున్నది
అలిగావా చిట్టి చిలక
దిగవా నేల వంకా
అడిగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
నాతోట పువ్వే నాపై కోపమంటే
ఈ ప్రాణమింక ఉన్నా లేనిదంతే
నాలోని సగమే నాకే దూరముంటే
ఏ సందడైనా మనసే నవ్వదంతే
చిలిపి జగడాన్ని పెంచుకున్నాను
నేస్తమా తప్పు నాదే
చెలిమి విరహాన చేదు చూసాను పంతమా ఆగవే
అలిగావా చిట్టి చిలక
దిగవా నేల వంక
అడిగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక
Credits
Writer(s): Ramajogayya Sastry, R P Patnayak
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.