Testo Adugestene - K. S. Chithra, Malathi & Sangeetha
Testo della canzone Adugestene (K. S. Chithra, Malathi & Sangeetha), tratta dall'album Adavi Ramudu (Original Motion Picture Soundtrack)
అడుగేస్తే కడలైనా దారిస్తుందీ
పిలిస్తే పొడి ఇసుకైనా నీరిస్తుందీ
మనసిస్తే శిలైనా ప్రేమిస్తుందీ
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ
జన్మల ముడివేసే కధ ఎప్పుడు ముగిసిందీ
ప్రేమబలం చెదరనిదీ, ప్రేమ రధం నిలవనిదీ
కత్తులు తీర్చనిదీ కాటిచిన్న కాల్చనిదీ
గాలులు తుంచనిదీ జడివానలు ముంచనిదీ
ఆత్మకున్న అన్నిలక్షణాలు ప్రేమా
కృష్ణుడన్న గీతలోని భావమె ప్రేమా
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ
జన్మల ముడివేసే కధ ఎప్పుడు ముగిసిందీ
ప్రేమబలం చెదరనిదీ, ప్రేమ రధం నిలవనిదీ
చితినైనా బతికించే అమృతమే కాదా ప్రేమించే మనసంటే
విధినైనా ఎదిరించ్చే నమ్మకమే రాద ఆ మనసే నిదైతే
అందుకే పద పద తెగించి ముందుకే సదా ఎదా తలొంచినందుకే
కదా ఇదంతా సహించి ఎందుకే వృదా వ్యధా భరించి
చూస్తూ కూర్చుంటే బ్రతుకంతా బరువు కదా
బాధే బలమైతే ఎడబాటే బాటవదా
కొండనెత్తు సత్తు వున్న ఎంత ఘనులైనా
జంట చిచ్చు అంటుకున్న మంటనార్పగలరా
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ
జన్మల ముడివేసే కధ ఎప్పుడు ముగిసిందీ
ప్రేమబలం చెదరనిదీ, ప్రేమ రధం నిలవనిదీ
నీకోసం జివించే చెలిమే వెలుగవదా నువు సాగే దారుల్లో
నీపేరే ధ్యానించ్చే పిలుపే వినలేదా నిను తాకే గాలుల్లో
ప్రాణమా నువ్వే ఇలా వెలేసి పోకుమా ఎటో అలా జతైన
పాదమా నువ్వే ఇలా సిలయితే న్యాయమా క్షణం క్షణం వెన్నంటి
ప్రేమా నావెంటే కడదాకా నీవుంటే
నిప్పే నీరవదా నిట్టూర్పే తూర్పవదా
అష్ట దిక్కులడ్డువచ్చి నిన్ను ఆపగలవా
సప్తసాగరాలు దాటి నన్ను చేరలేవా
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ
జన్మల ముడివేసే కధ ఎప్పుడు ముగిసిందీ
ప్రేమబలం చెదరనిదీ, ప్రేమ రధం ఆగనిది
ప్రేమబలం చెదరనిదీ, ప్రేమ రధం నిలవనిదీ
Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.