Testo Padipoya - Suchitra
Testo della canzone Padipoya (Suchitra), tratta dall'album Barbie Girl Suchitra Telugu Hits
పద పదమన్నది నా అడుగే నీ వైపు
అటు ఇటు చూడకు అంటోందే నా చూపు
నా మది కూడా ఎపుడో జారిందే
అది ప్రేమో ఏమో తెలిసేలోపు
నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా
నిలువెల్లా నీతోనే ముడిపడిపోయా
నే చెడిపోయా చెడిపోయా చెడిపోయా చెడిపోయా
తరిమే నీ ఊహలతో మతిచెడిపోయా
పద పదమన్నది నా అడుగే నీ వైపు
అటు ఇటు చూడకు అంటోందే నా చూపు
నా గతము చెరిపి నిజము తెలిపి పోల్చనంతగా
నన్నే అణువణువు మార్చెను నీ ప్రణయం
ఈ కరుకు మనసు కరిగి కరిగి రేయి పగలు
నా కలలను నీ తలపుతొ ముంచినది సమయం
నీ ప్రేమే... నీ ప్రేమే...
ఓ వరమల్లే గుండెల్లోన కొలువుతీరదా
నా ప్రేమే... నా ప్రేమే...
నను గెలిపించి నిను నాతో నడిపిస్తుందా
పద పదమన్నది నా అడుగే నీ వైపు
అటు ఇటు చూడకు అంటోందే నా చూపు
నా మది కూడా ఎపుడో జారిందే
అది ప్రేమో ఏమో తెలిసేలోపు
నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా
నీతోనే ఈ నిమిషం ముడిపడిపోయా
నే చెడిపోయా చెడిపోయా చెడిపోయా చెడిపోయా
ప్రేమించే నీ కొరకే మతిచెడిపోయా
Credits
Writer(s): Achu, Vanamaali
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.