Testo Nee Parichayamutho - Sid Sriram feat. Gopi Sundar
Testo della canzone Nee Parichayamutho (Sid Sriram feat. Gopi Sundar), tratta dall'album Nee Parichayamutho (From "Choosi Choodangaane") - Single
నీ పరిచయముతో నా మదిని గెలిచా
నీ పలకరింపుతో నా దిశను మార్చినా
అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా
నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా
నీ పరిచయముతో నా మదిని గెలిచా
ఏ గతము ఎదురవదిక నీ తలపే జతపడితే
ఏ గురుతు నిలబడదిక నీ పిలుపే వినబడితే
నాలోని లోతు చూపిన నీ పరిచయముతో
నిలువునా నే వెలిగి వెలుగులలో నే మునిగా
పదనిసలేవో తడిమి పరవశమై పైకెగిరా
నీ చెలిమే ప్రతిక్షణముని నా వరకు నడిపినది
నీ మహిమే ప్రతి మలుపుని తీరముగ మలిచినది
నాలోని నన్ను చేర్చిన నీ పరిచయముతో
నీ పరిచయముతో నా కలని కలిసా
నీ వెలుగు వానలో నే తడిసిపోయినా
అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా
నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా
చివరిదాకా నిలిచే హృదయమునే నే కలిసా
చెరగని ప్రేమై మిగిలే
మనసుని నేనై మురిసా
Credits
Writer(s): Gopi Sundar, Ananth Sriram
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.