Testo Cheliya Cheliya - Suchitra
Testo della canzone Cheliya Cheliya (Suchitra), tratta dall'album Tollywood Heart Breaking Songs
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
చిగురు ఎదలో చితిగ మారినది
విరహ జ్వాలే సెగలు రేపినది
మంచు కురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
తడిసి పోతున్నా
తడిసి పోతున్నా
శ్వాస నీవే తెలుసుకోవే
స్వాతి చినుకై తరలి రావే
నీ జతే లేనిదే నరకమే ఈ లోకం
జాలి నాపై కలగదేమే
జాడ అయినా తెలియదేమే
ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీకోసం
ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం
పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా (తనువు నదిలో మునిగి ఉన్నా)
చెమట జడిలో తడిసి పోతున్నా (చెమట జడిలో తడిసి పోతున్నా)
గుండెలోన వలపు గాయం మంట రేపే పిదపకాలం
ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా
దూరమైన చెలిమి దీపం భారమైన బతుకు శాపం
ప్రియతమా హృదయమా తరలిరా నేడైనా
కలవు కావా నా కన్నుల్లో నిమిషమైనా నీ కౌగిలిలో
సేద తీరాలి చేరవా నేస్తమా
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
ప్రియతమా
Credits
Writer(s): Harris Jayaraj, Kula Sekhar
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.
Altre canzoni dell'album
Gucchi Gucchi (From "Rajubhai")
Thalachi Thalachi (Female Version) [From "7G Brundhavana Colony"]
Nammaka Tappani - From "Bommarillu"
Nammaka Tappani (From "Bommarillu")
Ee Kshnam Oke Oka Korika (From "Ela Cheppanu")
Nuvve Nuvve Kavalantundi (From "Nuvve Nuvve")
Oke Oka Mata (From "Chakram")
Bandamekkado (From "100% Love")
Hrudayam Anu (Female Version) [From "Aaru"]
Manasa Manninchavamma (From "Aadavari Matalaku Ardhale Verule")