Testo Athanokkade - Mani Sharma feat. Ranjith
Testo della canzone Athanokkade (Mani Sharma feat. Ranjith), tratta dall'album Athanokade
అతనొక్కడేలే అందర్లోను
ఈ జీవితమంటే ఓ కోరిక రేపే
అతనొక్కడేలే
అతనొక్కడేలే ఎవ్వరికైనా ఓదార్పును చూపే
ఓ దారిని చూపే అతనొక్కడేలే
అతనొక్కడేలే అతనికి తోడు ఆనందంలోనూ బాధే ఐననూ
అతనొక్కడేలే అందర్లోను తానొకడై కూడా ఉన్ననూ
ఈ లోకమంతా మనలో ఉంది
మన కోసం ఉంది
మన తోడై ఉంది నీడనంది
మది కోరుకుంది ఇస్తానంది
నవ్విస్తానంది కవ్విస్తానంది నేస్తమంది
మనమొంటరైతే వెంటే ఉంది
మన జంటే అంది ప్రాణం లాంటిది
మన బాధ అంతా నాదే అంటూ నేనున్నానంటు అన్నది
ఓ చిన్ని ఆశతో సాగావంటే కేకేసావంటే
ఆకాశం కూడ అదిరిపోదా
నీ చిన్ని గుండెలో దాచావంటే
భూగోళం కూడా భూపాళం పట్టి నిదుర పోదా
ఏం చెయ్యాలన్నా నీలో ఉంది
అడుగేసావంటే అడ్డే ఉన్నదా
నీ హద్దుల్నే నువ్ వద్దన్నావో
నీ వద్దే అంతా చేరదా
Credits
Writer(s): Mani Sarma, Sai Sri Harsha
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.